![]() |
![]() |

రీసెంట్ గా రిలీజయిన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకర్ గా రష్మీ బదులు ప్రదీప్ కనిపించాడు. దాంతో ఆడియన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. "ఇప్పటి నుంచి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి రాజు ఈ ప్రదీప్ మాచిరాజు " అంటూ ఎంట్రీలోనే ఎలివేషన్ బాగా ఇచ్చాడు ప్రదీప్. "లేచిన దగ్గర నుంచి నేనిక్కడ నువ్వక్కడ అంటారే వాళ్లిద్దరూ ఎక్కడా " అంటూ ఆది ప్రదీప్ ని వాళ్ళ గురించి అడిగాడు. "అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయని సాయంత్రం స్లాట్ లో వేశారు వాళ్ళను. " అంటూ అసలు విషయాన్నీ చెప్పాడు ప్రదీప్.
"నువ్వు ఎక్కడెక్కడికో వెళ్లి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అన్నావ్ ..ఇప్పుడేమో ఇక్కడమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది అక్కడ అబ్బాయిని ఇక్కడికి వచ్చాను అంటున్నావ్ ఎక్కడికెళ్తున్నారు ఏమైపోయారు ఎటుపోయారు " అని ఆది అన్ని విషయాలు ఆరా తీసాడు. వెంటనే ప్రదీప్ "లేదులే ఇప్పుడు మొత్తం బాచ్ అంతా కలిసి ఇక్కడే ఉంటాం " అన్నాడు ప్రదీప్. "ఓహ్ అవునా మొత్తం సండే " అన్నాడు ఆది. "అవును మొత్తం సండే మనదే " అన్నాడు ప్రదీప్.
ఐతే రష్మీ ఇప్పుడు జబర్దస్త్ కి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్ షోని కూడా సండే ఈవెనింగ్ స్లాట్ కి తీసుకొచ్చేశారు. ఆదివారం మధ్యాహ్నం శ్రీదేవి డ్రామా కంపెనీ సాయంత్రం జబర్దస్త్ రెండూ షోస్ లో ఒకే యాంకర్ కనిపిస్తే ఆడియన్స్ కూడా బోర్ ఫీలవుతారని మల్లెమాల అంచనా వేసినట్టు ఉంది. అందుకే మధ్యాహ్నం స్లాట్ లో ప్రదీప్ ని ఈవెనింగ్ స్లాట్ కి రష్మిని డివైడ్ చేసినట్టు తెలుస్తోంది.
అంటే ఇప్పుడు సండే షోస్ ఏంటి ఎవరెవరు టైమింగ్స్ ఏంటి అని పరిశీలిస్తే. జులై 26 నుంచి మార్పులు జరగబోతున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తుంది. యాంకర్ ప్రదీప్. సాయంత్రం 6 గంటలకు జబర్దస్త్ రాబోతోంది . యాంకర్ రష్మీ. ఫామిలీ స్టార్స్ సీజన్ 2 ఆదివారం సాయంత్రం 7.30 కి ప్రసారం కాబోతోంది. యాంకర్ సుధీర్. అంటే ఈటీవీలో ఒక స్థాయిలో ఉన్న యాంకర్స్ ముగ్గురినీ ఆదివారం చూడబోతున్నారు ఆడియన్స్. ఇక నుంచి సుండేని సూపర్ సండేగా ఆడియన్స్ కి ఫండేగా మార్చబోతోంది ఈటీవీ.
![]() |
![]() |